Revanth Reddy: కాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్‌రెడ్డి

Revanth Reddy: దమ్ముంటే ఈటల ప్రమాణం చేయాలంటున్న రేవంత్

Update: 2023-04-22 12:11 GMT

Revanth Reddy: కాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో ఇప్పుడు 25 కోట్ల పంచాయితీ నడుస్తోంది. మునుగోడు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు 25 కోట్లు ఇచ్చిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ భగ్గుమంది. తాము 25 కోట్లు తీసుకున్నట్లుగా ఈటల రాజేందర్ నిరూపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

భాగ్యలక్షి ఆలయంలో తాను తడిబట్టలతో ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు నిజమైతే ఆయన కూడా ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరారు. దీంతో ఆ సవాళ్ల రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.    

Tags:    

Similar News