GHMC: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్.. కొత్తగా 6 జోన్లు.. డివిజన్ల సంఖ్య 300కు పెంపు..!!

GHMC: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్.. కొత్తగా 6 జోన్లు.. డివిజన్ల సంఖ్య 300కు పెంపు..!!

Update: 2025-12-26 00:01 GMT

GHMC Delimitation: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. జోన్లు, సర్కిల్లు, డివిజన్లను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లకు 12కు పెంచగా.. 30 సర్కిళ్లను 60కు పెంచింది. అలాగే డివిజన్లను 300కు పెంచుతూ తుది నిర్ణయం తీసుకుంది. డివిజినల్ల డీలిమిటేషన్ కు సంబంధించి పది రోజులపాటు అభ్యంతరాలు స్వీకరణ తర్వాత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

GHMC Delimitation: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ .. పరిపాలనను మరింత విస్తరించి.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. పరిపాలనా నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తూ జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా విస్తరించింది. సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కు పెంచింది. డివిజన్లను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ప్రాంతాలను కొత్త జోన్లుగా గుర్తించారు. ఈ కొత్త జోన్లకు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రస్తుతం ఉన్న సర్కిల్ కార్యాలయాల్లోనే జోన్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచే పూర్తి స్థాయి పరిపాలన ప్రారంభం కానుంది.

డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ.. ఈ నెల 9వ తేదీన ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అనంతరం 10 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. ఈ కాలంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి 6 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. వాటిని సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైన న్యాయసమ్మతమైన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు.

ఈ మొత్తం ప్రక్రియ తర్వాత..ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా పరిపాలన మరింత సమర్థవంతంగా మారడంతో పాటు, నగరవాసులకు సేవలు వేగంగా, సులభంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News