Revanth Reddy: హరీష్‌రావు వ్యాఖ్యల కారణంగానే .. రైతు బంధు నిలిచిపోయింది
Revanth Reddy: ఈ ద్రోహులకు ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదు
Revanth Reddy: హరీష్‌రావు వ్యాఖ్యల కారణంగానే .. రైతు బంధు నిలిచిపోయింది
Revanth Reddy: రైతు బంధు ఈసీ బ్రేక్ వేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. హరీష్‌రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ ద్రోహులకు ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 15వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.