Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: రాష్ట్రంలో అధ్వాన్నంగా పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం పథకంలో లోపాలపై విమర్శలు చేశారు. సవాలక్ష సమస్యలతో మిడ్ డే మిల్స్ అభాసు పాలు అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేశారని.. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. విద్యార్థులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ రాజకీయాలు చేసే స్థితికి దిగజారారని పీసీసీ చీఫ్ లేఖలో పేర్కొన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా మిడ్ డే మిల్స్ బడ్జెట్ పెంచలేదని,, మెనూలో మార్పుల వల్ల వంట కార్మికులకు ఆర్థిక భారం పెరిగిందన్నారు. చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవు, చెట్ల కింద వంట చేయడంతో భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నారని రేవంత్ ఆరోపించారు. వంట కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి.