Revanth Reddy: కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కాంగ్రెస్‌తోనే సాధ్యం
Revanth Reddy: తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు
Revanth Reddy: కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కాంగ్రెస్‌తోనే సాధ్యం
Revanth Reddy: కేసీఆర్ కుర్చి కదులుతుందనే ఢిల్లీలో కేటీఆర్ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై.. ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటూ రేవంత్ ఆరోపించారు. ఐటీ దాడుల్లో రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని.. ఆస్తులను విడిపించుకునేందుకు మోడీకి కేసీఆర్ లొంగిపోయారని.. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరన్నారు. 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోడీ.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌పై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.