Renuka Chowdhury: ఆ పబ్‌తో నా కూతురికి సంబంధం లేదు...
Renuka Chowdhury: హైదరాబాద్ మింక్ పబ్ కేసుకు తమకు ఎలాంటి సంబంధంలేదని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి స్పష్టంచేశారు.
Renuka Chowdhury: ఆ పబ్‌తో నా కూతురికి సంబంధం లేదు...
Renuka Chowdhury: హైదరాబాద్ మింక్ పబ్ కేసుకు తమకు ఎలాంటి సంబంధంలేదని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి స్పష్టంచేశారు. పోలీసులు దాడి చేసిన పబ్ తన కూతురిదేనని జరుగుతున్న ప్రచారాన్ని రేణుకా చౌదరి ఖండించారు. తన కుమార్తెను పోలీసులు విచారించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. మింక్ పబ్ నిర్వాహణలోనూ తమకు ఎలాంటి భాగస్వామ్యంలేదని ఆమె పేర్కొన్నారు. తన కుమార్తె పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌కి తన కూతురు యజమాని కాదని, దాని స్థాపనలో, నిర్వహణలో తన కూతురికి ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించారు.