HD Revanna: జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు ఊరట

HD Revanna: జైలు నుంచి విడుదలైన హెచ్‌డి రేవణ్ణ

Update: 2024-05-14 11:09 GMT

HD Revanna: జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు ఊరట

HD Revanna: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారం మంజూరు చేశారు. రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు విధించారు.

కిడ్నాపింగ్ కేసులో హెచ్‌డీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చడంతో మే 4న ఆయన పోలీసులు అరెస్టు చేశారు. మే 8 వరకూ పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మే 14 వరకూ ఆయనకు జ్యూడిషయల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల బాధితురాలిని హెచ్‌డీ రేవణ్ణ ఆదేశాలతోనే ఆయన అనుచరుడు ఏప్రిల్ 29న ఇంటి నుంచి అపహరించుకు వెళ్లినట్టు కోర్టుకు సిట్ తన వాదన వినిపించింది. మే 5న హెచ్‌డీ రేవణ్ణ సన్నిహితునికి చెందిన ఒక పొలంలో బాధిత మహిళను కనుగొన్నట్టు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తూ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది.

Tags:    

Similar News