సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2020-01-04 12:36 GMT
CCA Protest

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఆందోళన ఉధృతమైంది. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పైకి ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఆందోళనలతో ట్యాంక్ బండ్ పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఇందిరాపార్కు వద్ద సభావేదికకు ముస్లింలు భారీగా చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇందిరాపార్కు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆశోక్ నగర్, ట్యాంక్ బండ్ వరకు వాహనలు నిలిచిపోయాయి. ఈ ర్యాలీలో జాతీయ జెండాలు ప్లకార్డులతో హిందుస్థాన్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిదాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్, సీపీఐ నేత అజీజ్ పాషా అంజద్ ఉల్లా ఖాన్ పలువురు నాయకులు పాల్గొన్నారు.


Full View

 

Tags:    

Similar News