Road Accident: గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా..

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది.

Update: 2026-02-19 07:06 GMT

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా..

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి 44 (NH-44)పై ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) బస్సు ప్రమాదానికి గురైంది. ఇటిక్యాలపాడు సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి.

హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి వెళ్తున్న ఈ బస్సు, ఇటిక్యాలపాడు వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News