Kalvakuntla Kavitha: తెలంగాణాలో కొత్త పార్టీ.. కవిత పోటీ అక్కడ నుంచే..!

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.

Update: 2026-02-19 06:55 GMT

Kalvakuntla Kavitha: తెలంగాణాలో కొత్త పార్టీ.. కవిత పోటీ అక్కడ నుంచే..!

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తాను సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి సంచలనం సృష్టించారు.

వచ్చే మే నెల మొదటి వారంలో తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు కవిత వెల్లడించారు. పార్టీ పేరులో ఖచ్చితంగా 'తెలంగాణ' అనే పదం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె సంకేతాలిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాల మధ్య కవిత తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అంశంపై కూడా కవిత స్పష్టతనిచ్చారు.

మొదటి ఛాయిస్: సిద్ధిపేట

రెండో ఛాయిస్: బోధన్

తనకు ఈ రెండు నియోజకవర్గాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News