Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ఇదే..!

Telangana Budget 2026: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది.

Update: 2026-02-19 06:08 GMT

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ఇదే..!

Telangana Budget 2026: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, కొత్త ప్రతిపాదనలతో కూడిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుకు తీసుకురావడానికి యంత్రాంగం సిద్ధమైంది.

బడ్జెట్ సమావేశాల తేదీలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ముసాయిదాకు ఆమోదం తెలపడంతో పాటు, సమావేశాల నిర్వహణపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.

సమావేశాలు ప్రారంభమైన అనంతరం, ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈసారి బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు కేటాయింపులు, వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ బడ్జెట్ సమావేశాలను సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల పద్దులపై చర్చ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వంటి కార్యక్రమాలతో సభ బిజీగా ఉండనుంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకోనుంది.

Tags:    

Similar News