Free Bus: మహిళలకు గుడ్ న్యూస్.. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు వచ్చేది అప్పుడే..!

Free Bus: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం 'స్మార్ట్‌కార్డుల' జారీ ప్రక్రియను వేగవంతం చేసింది.

Update: 2026-02-19 06:30 GMT

Free Bus: మహాలక్ష్మి పథకంలో స్మార్ట్ మలుపు.. ఇక కార్డు ఉంటే చాలు!

Free Bus: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం 'స్మార్ట్‌కార్డుల' జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌కార్డులను మహిళలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

రాష్ట్ర బడ్జెట్ (2026-27) సన్నాహకాల్లో భాగంగా ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో రవాణా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం కోసం మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్‌కార్డులను సిద్ధం చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు.

స్మార్ట్‌కార్డుల ప్రత్యేకతలు:

ఆర్టీసీ అధికారులు మూడు రకాల స్మార్ట్‌కార్డుల నమూనాలను మంత్రులకు చూపించారు. వీటిని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి ఒక దానిని ఖరారు చేయనున్నారు.

ఇవి అత్యాధునిక చిప్‌తో కూడిన కార్డులు. వీటి తయారీకి సుమారు రూ. 75 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

తొలుత జిల్లాకు ఒక మండలం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి ఈ కార్డులను పైలట్ ప్రాజెక్టు కింద అందజేస్తారు. అక్కడ సాంకేతిక సమస్యలు ఏవైనా తలెత్తితే వాటిని పరిష్కరించి, ఆపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తారు.

ఆర్థిక సాయం కోరిన ఆర్టీసీ:

స్మార్ట్‌కార్డుల తయారీకి అయ్యే రూ. 75 కోట్ల వ్యయాన్ని ఆర్థిక సాయం రూపంలో అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపులపై ఎండీ నాగిరెడ్డి ఆర్థిక మంత్రితో చర్చించారు. స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి వస్తే జీరో టికెట్ల జారీలో జాప్యం తగ్గి, ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

Tags:    

Similar News