Suryapet: పారిపోతుంటే పట్టుకున్నారు.. స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు! ప్రేమోన్మాదికి స్థానికుల ‘స్పాట్’ జస్టిస్!

Suryapet: ప్రేమ పేరుతో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. తనను ప్రేమించడం లేదనే కక్షతో ఓ యువతిపై సుత్తెతో అత్యంత పాశవికంగా దాడి చేశాడు.

Update: 2026-02-19 09:51 GMT

Suryapet: పారిపోతుంటే పట్టుకున్నారు.. స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు! ప్రేమోన్మాదికి స్థానికుల ‘స్పాట్’ జస్టిస్!

Suryapet: ప్రేమ పేరుతో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. తనను ప్రేమించడం లేదనే కక్షతో ఓ యువతిపై సుత్తెతో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేటలోని స్నేహ నగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది.

స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు కొంతకాలంగా సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. యువతి అతడిని తిరస్కరించడంతో ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి ప్రవేశించిన నిందితుడు, తన వెంట తెచ్చుకున్న సుత్తెతో యువతి తలపై బలంగా బాదాడు.

యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆమె రక్తపు మడుగులో స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తలకు తీవ్రమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

దాడి చేసి పారిపోతున్న నిందితుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కాలనీ వాసులు నిందితుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, వేధింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమోన్మాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్నేహ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News