ఇవాళ తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ
Rahul Gandhi: వరంగల్ రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇవాళ తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ
Rahul Gandhi: వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆ పార్టీ జాతీయ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. మూడు రోజులపాటు 8 నియోజకవర్గాలలో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ముందుగా వరంగల్ జిల్లాలో రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం.. సాయంత్రం ములుగులో నిర్వహించే సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. రాహుల్ మాత్రం రెండు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నారు. ---
ఇక.. రేపు కరీంనగర్, ఎల్లుండి నిజామాబాద్‌లో రాహుల్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ భావించింది. ఈ యాత్రలో భాగంగా నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు, చెరుకు మహిళా రైతులతో రాహుల్ భేటీ అవుతారు. తెలంగాణలో మొదట విడత బస్సు యాత్ర ద్వారా చాలా జిల్లాల్లో రాహుల్ పర్యటించనున్నారు. మొదట విడత బస్సు యాత్రలో కొన్ని చోట్ల రాహుల్ పాదయాత్ర కూడా చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా రైతులతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో... టీకాంగ్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.