Sankranthi Rush: పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల క్యూ
Sankranthi Rush: సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు బయలుదేరిన పట్టణ వాసులు
Sankranthi Rush: పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల క్యూ
Sankranthi Rush: సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు తమ వాహనాల్లో పట్టణ వాసులు బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు క్యూ కట్టాయి. ఫాస్టాగ్ విధానం అమలులో ఉండడంతో 95 శాతం వాహనాలు వెళ్లిపోతున్నాయి. అయితే ఓకే సారి పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో విజయవాడ వైపు 10 గేట్లను టోల్ గేట్ సిబ్బంది తెరిచారు. అయినప్పటికీ 200 మీటర్ల మేర వాహనాలు వరుస కట్టాయి.