కామారెడ్డి జిల్లాలో పూణె న్యాయవాది కాల్చివేత
Kamareddy: మద్నూర్ మండలం కోడిచిర శివారులో మృతదేహం లభ్యం
కామారెడ్డి జిల్లాలో పూణె న్యాయవాది కాల్చివేత
Kamareddy: పూణెలో కిడ్నాప్ అయిన న్యాయవాది.. కామారెడ్డి జిల్లాలో హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. మద్నూర్ మండలం కోడిచిర శివారులో న్యాయవాది మృతదేహం లభ్యమైంది. డిసెంబర్ 31న పూణెలో లాయర్ శివశంకర్ షిండేను రాజేష్ యాదవ్ కిడ్నాప్ చేశాడు. గూడ్స్ వ్యాన్‌లో కామారెడ్డి జిల్లాకు తీసుకొచ్చి.. కోడిచిర శివారులో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. జూనియర్ లాయర్‌తో శివశంకర్ వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు రాజేష్ యాదవ్‌ను.. పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.