Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చేదు అనుభవం.. నిలదీసిన గ్రామస్తులు
Koppula Eshwar: గ్రామస్తుల ఆందోళనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్
Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చేదు అనుభవం.. నిలదీసిన గ్రామస్తులు
Koppula Eshwar: జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ తగిలింది. వెల్గటూర్ మండలం పాసిగామ దగ్గర ఇథనాల్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు స్థానికులు. తమ గ్రామంలో ప్రాజెక్టు నిర్మాణం చేయొద్దంటూ నిరసన తెలిపారు. స్థానికుల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలికారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.