Hyderabad: డాక్టర్‌ కావాలనుకుని.. దారి మళ్లిన యువతి.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ శృతి

Spa Massage Centers: అనారోగ్య సమస్యలుంటే మా సెంటర్‌కు రండి. తలనొప్పి, ఒళ్లు నొప్పులను ఇట్టే నయం చేస్తాం అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తారు.

Update: 2023-06-28 06:15 GMT

Hyderabad: డాక్టర్‌ కావాలనుకుని.. దారి మళ్లిన యువతి.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ శృతి

Spa Massage Centers: అనారోగ్య సమస్యలుంటే మా సెంటర్‌కు రండి. తలనొప్పి, ఒళ్లు నొప్పులను ఇట్టే నయం చేస్తాం అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తారు. రకరకాల ప్యాకేజీలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తారు. సింగిల్ విజిట్‌తో మీ హెల్త్ సమస్యలను దూరం చేసుకోండి అంటూ చెప్తారు. కానీ ఒక్కసారి లోపలికి వెళ్లిన తర్వాత...సీన్ మరోలా ఉంటుంది. ఇదీ స్పా సెంటర్లలో జరుగుతున్న దో నెంబర్ గలీజు దందా. డాక్టర్ అవ్వాలని కలలుకన్న ఓ యువతి...చివరికి వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడడం..సంచలనం రేపుతోంది.

స్పా సెంటర్లు...ఇప్పుడువి వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. పేరుకు మసాజ్ చేస్తామంటూ చెప్తూ లోపలికి వెళ్లిన తర్వాత అసలు పని మొదలవుతుంది. హైదరాబాద్ నగరంలో తాజాగా పోలీసులకు పట్టుబడ్డ ‌ఓ స్పా సెంటర్‌లో అనేక సంచలన విషయాలు వెలుగుచూశాయి. డాక్టర్ అవ్వాలనుకున్నామె వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడింది. ఇది వినాడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. హైదరాబాద్‌లోని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ స్పా సెంటర్‌పై దాడి చేసి వ్యభిచారం కూపంలో ఇరుక్కుపోయిన యువతులను అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. అయితే స్పా నిర్వాహకుల బ్యాక్‌గ్రౌండ్‌ను ఆరా తీసిన పోలీసులకు దిమ్మతిరిగే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్పా సెంటర్ పేరుతో వ్యభిచార కూపాన్ని నడుపుతున్నారు కొంతమంది నిర్వాహాకులు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు ముందస్తుగా సమాచారం అందింది. వెంటనే మఫ్టీలో వెళ్లిన పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే ముగ్గురు నిర్వాహకులు, 18 మంది విటులను అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితురాలు, స్పా సెంటర్ నిర్వాహాకురాలు శృతి బ్యాక్ గ్రౌండ్ విని పోలీసులు విస్తుపోయారు. పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో జరుగుతున్న వ్యవహారంలో ఓ యువతి కింగ్‌పిన్‌గా ఉన్నారని తేల్చారు పోలీసులు. కీలక సూత్రధారి శృతి..రమణ, జాహెద్‌ యువకులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి అందమైన యువతులను రప్పించి క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ప్రధాన నిందితురాలు భద్రాచలంకు చెందిన శృతిని పోలీసులు విచారించగా...పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. డాక్టర్ అవ్వాలనుకున్న శృతి..డబ్బుల్లేక డాక్టర్‌ చదువుకు గుడ్ బై చెప్పినట్లు వివరించింది. ఉక్రెయిన్‌లో MBBS మొదటి ఏడాది కోర్సు పూర్తి చేసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసింది. డాక్టర్ కావాలనే కలలు కల్లగా మిగిలిపోవడంతో హెయిర్‌ హోస్టెస్‌గా పని చేయాలనుకుంది. అందుకోసం అమీర్‌పేట్‌లో ఓ సంస్థలో శిక్షణ కూడా తీసుకుంది. తర్వాత ఆ కలను కూడా వదిలేసి ఓ స్టార్‌ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. అప్పుడే ఈజీగా డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకున్న శృతి...దాని కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. అప్పటికే పరిచయం ఉన్న రమణ, జాహెద్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద మసాజ్ సెంటర్‌ను స్టార్ట్ చేసింది. అక్కడ మసాజ్‌ పేరుతో వ్యభిచారం చేయించింది. రమణ, జాహెద్‌ ముంబై, కోల్‌కతా లాంటి వేర్వేరు ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ ఈ వ్యభిచారం రొంపిలోకి లాగారు.

అయితే ఇక్కడ మరో ట్విస్టును పోలీసులు బయటపెట్టారు. ప్రధాన నిందితురాలు శృతి గతంలోనే వ్యభిచార కూపం నడిపిస్తుండగా...పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. జైలు జీవితం గడిపి బయటకు వచ్చినా శృతిలో ఎలాంటి మార్పురాలేదు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మరోసారి అదే పనిని తిరిగి మొదలుపెట్టింది. ఈసారి ప్లేస్ మార్చి కొత్త స్టైల్లో వ్యాపారం స్టార్ట్ చేసింది. కానీ ఈసారి కూడా పోలీసులకు చిక్కి మళ్లీ జైలు బాట పట్టింది. స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News