రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi: అధికారమే లక్ష్యంగా హస్తం వ్యూహం

Update: 2023-10-30 09:50 GMT

రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi: ఎన్నికల ప్రచారాలతో తెలంగాణ హోరెత్తుతోంది. అధికారమే లక్ష్యంగా హస్తం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా.. రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో.. రెండు నియోజకవర్గాలలో పర్యటించనున్న ప్రియాంక.. ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించి కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్ర చేరుకొని.. మహిళలతో సమావేశమై ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కొల్లాపూర్‌ నియోజకవర్గంలో.. పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ప్రియాంకగాంధీ.

Tags:    

Similar News