PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. ఇవాళ మల్కాజిగిరిలో రోడ్ షో..

PM Modi: భాగ్యనగరం వేదికగా మోడీ ఎన్నికల శంఖారావం

Update: 2024-03-15 02:17 GMT

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. ఇవాళ మల్కాజిగిరిలో రోడ్ షో..

PM Modi: ప్రధాని మోడీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకట్రెండు రోజులుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుండటంతో... మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తుంది. భాగ్యనగరం వేదికగా ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దక్షిణాదిపై ప్రత్యేక ఫోకస్ చేసిన కమలదళం తెలంగాణలో మెజార్టీపై దృష్టిపెట్టింది. సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్‌గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

జాతీయ నేతలను ప్రచార పర్వం మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్‌షా పర్యటించగా.. పది రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు నిర్వహిస్తుంది. ఇవాళ మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఐదు కిలో మీటర్ల మేర ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ సాయంత్రం నాలుగు గంటల 55 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి లో రోడ్ షో లో పాల్గొంటారు. మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి క్రాస్‌ రోడ్‌ వరకు మోడీ రోడ్‌షో నిర్వహించనున్నారు, రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు నాగర్‌కర్నూల్‌లో పర్యటిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక బయల్దేరి వెళ్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News