Droupadi Murmu: కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను సందర్శించనున్న రాష్ట్రపతి

Droupadi Murmu: విద్యార్థులు, ఫ్యాకల్టీతో ద్రౌపదీ ముర్ము సమావేశం

Update: 2022-12-27 02:28 GMT

Droupadi Murmu: కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను సందర్శించనున్న రాష్ట్రపతి

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఇవాళ హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థను సందర్శించనున్నారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో రాష్ట్రపతి సమావేశమవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మాల్దీవుల దేశాల అధికారులతోనూ సమావేశమవుతారు. భద్రాచలం, రామప్ప ఆలయాలను రేపు సందర్శిస్తారు. 29న ఉదయం షేక్ పేటలోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. 30న రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఏపీకి చెందిన అంగన్ వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Tags:    

Similar News