Ponnam Prabhakar: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
Ponnam Prabhakar: పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
Ponnam Prabhakar: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
Ponnam Prabhakar: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇది ప్రజల గెలుపుగా భావిస్తున్నట్లు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన హుస్నాబాద్ ఈవీఎం స్ట్రాంగ్ రూమును నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ప్రకటిస్తే పదేళ్ల పాలనలో ఆకాంక్షలు నెరవేరలేదని, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని బంధీ చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన పదేళ్ల పరిపాలన చూసి ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే కాంగ్రెస్ వైపు చూసి, మార్పు రావాలి కాంగ్రెస్ కావాలని ప్రజలే నినాదమిచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు.