Asifabad: ఆసిఫాబాద్‌లో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం నారాయణగూడలో ASP ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు జిల్లాలో పలుచోట్ల భారీగా గంజాయి మొక్కలు గుర్తింపు గంజాయి సాగు చేయడం, విక్రయించడం నేరం- ఏఎస్పీ చిత్తరంజన్

Update: 2025-10-14 07:11 GMT

 Asifabad: ఆసిఫాబాద్‌లో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో పలుచోట్ల గంజాయి మొక్కలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. కెరమెరి మండలం నారాయణగూడ‎లో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించారు. నారాయణగూడలో 50 గంజాయి మొక్కలను.. గుమ్నూర్‌లో 30 గంజాయి మొక్కలను గుర్తించి కేసు నమోదు చేశామని ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. ‎


గంజాయి సాగు చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అన్నారు ఏఎస్పీ చిత్తరంజన్. ఎవరైనా గంజాయి సాగు చేసిన, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది ఈజీమనీకి అలవాటు పడి పంట చేన్లలో పత్తి, కంది పంట పొలాల మధ్యన గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయి సాగుచేసినా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ఏఎస్పీ చిత్తరంజన్ వెల్లడించారు. 

Tags:    

Similar News