ఎంపీ రేవంత్ రెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రేవంత్‌రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలను ఉల్లంఘించి మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్‌ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.