సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
Statue Of Equality: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
Statue Of Equality: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల పంచ లోహా విగ్రహాన్ని ప్రధాని మోడీ వసంత పంచమి పర్వదినం సందర్శంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగిందన్నారు మోడీ. గురువు వల్లే మనిషికి వికాసం లభిస్తుందన్నారు మోడీ. రామానుజాచార్యుల సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్పూర్తి అన్నారు మోడీ.