Person jump into Hussain Sagar with covid19 Fear: కరోనా భయంతో ఓ వ్యక్తి ఏం చేసాడంటే..

Person jump into Hussain Sagar with covid19 Fear: కరోనా లక్షణాలతో బాధపడుతూ ఓ వ్యక్తి హుసేన్ సాగర్ లో దూకి గల్లంతయ్యాడు

Update: 2020-07-05 06:47 GMT

Person Jump into Hussain Sagar with Covid19 Fear: కరోనా లక్షణాలతో బాధపడుతూ ఓ వ్యక్తి హుసేన్ సాగర్ లో దూకి గల్లంతయ్యాడు. ఈ సంఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల్లోకెళితే వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్నేండ్ల క్రితం భార్యతో కలిసి నగరానికి వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డారు. పల్టుపాన్‌ బంగారం పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత 10 రోజులగా ఆ వ్యక్తి తీవ్ర జ్వరంతో, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రతను తట్టుకోలేని ఆ వ్యక్తి తనకు సమీపంలో ఉన్న ఓ క్లినిక్‌లో చికిత్స చేయించుకున్నాడు.అయినప్పటికీ ఆ వక్యక్తికి జ్వరం తగ్గక పోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు గురు, శుక్ర రెండు రోజులు చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు.

బాధితుడు ఆ రెండు రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆస్పత్రి చుట్టూ తిరిగినా అక్కడి వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆతన్ని పట్టించుకోక పోగా, బెడ్లు లేవని చెప్పారు. అయినా ఆ వ్యక్తి తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని కాళ్ల వేళ్ల పడినా కనికరించలేదు. వైద్యం కావాలంటే నువు గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి శుక్రవారం సమస్య మరింత తీవ్రం కావడంతో పాటు శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది వచ్చింది. తీంతో అతను భయాందోళనకు గురై వెంటనే అతని స్నేహితునికి ఫోన్‌ చేశాడు. తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని హుస్సేన్‌ సాగర్‌ వద్దకు వెళితే చల్లటి గాలి వస్తుందని అక్కడికి తీసుకుని వెళ్లాలని కోరాడు.

అది విన్న బాధితుని స్నేహితుడు అతని వద్దకు చేరుకన్నాడు. ఇద్దరు కలిసి రాత్రి 7.55 గంటల సమయంలో ఆటోలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. వారు వెళ్లిన ఆటోను ట్యాంక్‌బండ్‌పై ఉండే పూజా స్టాల్‌ లేపాక్షి మధ్యలో నిలిపారు. తాను కొద్దిసేపు అలా తిరిగి వస్తానని పల్టు పాన్‌ ముందుకు నడుచుకుంటూ బాధితుడు వెళ్లాడు. ఆ తరువాత హుస్సేన్‌ సాగర్‌లో దూకాడు. అది గమనించిన బాధితుని స్నేహితుడు వెంటనే రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకుని నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ మాత్రం తెలియలేదు.  

Tags:    

Similar News