Covid Patients Travelled in RTC Bus: ఆ ముగ్గురు కరోనా క్యారియర్స్...

Covid Patients Travelled in RTC Bus: ఆ ముగ్గురు కరోనా క్యారియర్స్...
x
Representational Image
Highlights

Covid Patients Travelled in RTC Bus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Covid Patients Travelled in RTC Bus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కొంత మంది జనం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మరి కొంత మంది మాత్రం మాకేం అవుతుందిలే అని విచ్చల విడిగా తిరుగుతున్నారు. మరి కొంత మంది మాత్రం వారికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, వారికి కరోనా సోకినప్పటికి జనారణ్యంలో తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గరు వ్యక్తులు తమకు కరోనా ఉందని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఏకంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అసలు వారికి కరోనా సోకిందని ఎలా తెలిసింది, వైరస్ సోకిన తరువాత కూడా వారు ఏ విధంగా బస్సులో ప్రయానం చేసారో పూర్తివివరాల్లోకెళితే నిర్మల్‌ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు కరోనా లక్షణాలతో హైదరాబాద్ నగరానికి వచ్చారు. నగరానికి వచ్చిన ఆ ముగ్గురు కూడా ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నారు. కాగా వారికి ముగ్గురికి చేసిన పరీక్షల్లో వారికి పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత వారు రిపోర్టులు తీసుకుని శనివారం సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌కు మధ్యాహ్నం చేరుకుని సూపర్‌ లగ్జరీ బస్సు (TS08Z 0229) ఎక్కి ఆదిలాబాద్ వెళ్లి నేరుగా రిమ్స్‌లో చేరారు.

నేరుగా ఆస్పత్రికి చేరుకుని తమకు కరోనా వచ్చిందని తమను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం చేయాలంటూ డాక్టర్లను కోరారు. దీంతో వైద్యలు ఆ ముగ్గురు వ్యక్తులతో మాట్లాడి మీకు కరోనా సోకిందని ఎలా తెలుసని ప్రశ్నించారు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు జరిగిన కథ మొత్తం చెప్పారు. వెంటనే వైద్యులు అధికారులు సమాచారం అందించి అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ పేషెంట్లతో కలసి బస్సులో ప్రయాణించిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు. గత కొద్ది రోజుల క్రితమే కొత్తగూడెం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే కరోనా లక్షణాలతో బాధపడుతూ బస్సులో హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ నుంచి మళ్లీ తన సొంతూరికి చేరుకున్నాడు. ఆ తరువాత అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయమని కోరినా అక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హైదరాబాద్ తిరిగొచ్చిన అతడు ప్రయివేట్ ల్యాబ్‌లో కోవిడ్ టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది.


Show Full Article
Print Article
Next Story
More Stories