జగిత్యాల జిల్లా రాజరాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం.. ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె కిడ్నాప్‌కి యత్నం

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపింది.

Update: 2025-11-05 05:55 GMT

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు యత్నించారు. ఘటనపై కూతురు వెల్గటూరు పోలీస్ స్టేషన్‌ కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూరు మండలం రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్ ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో జులై 27న వివాహం చేసుకున్నారు.

రాకేష్‌ది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే ప్రియాంక కడుపుతో ఉండగా.. హాస్పిటల్‌లో చూపిస్తామని తల్లిదండ్రులు నమ్మించారు. హాస్పిటల్‌లో చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. తమ తల్లిడండ్రులతో తనకు తన భర్త రాకేష్‌కు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Full View


Tags:    

Similar News