Medaram Jatara 2026: మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు

Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణం భక్తిపారవశ్యంతో పులకించింది.

Update: 2025-12-24 06:39 GMT

Medaram Jatara 2026: మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు

Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణం భక్తిపారవశ్యంతో పులకించింది. తాడ్వాయి మండలం మేడారంలోని గద్దెలపై బుధవారం ఉదయం పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.

బుధవారం తెల్లవారుజాము నుంచే మేడారంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:00 గంటలకు గోవిందరాజును ప్రతిష్ఠించిన పూజారులు..అనంతరం ఉదయం 9:45 గంటలకు పగిడిద్దరాజును గద్దెలపై శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. దేవతామూర్తుల ప్రతిష్ఠాపన అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో గద్దెల ప్రాంగణంలోకి భక్తులను అనుమతించకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఈ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. మేడారం గద్దెలపై దైవ స్వరూపాలు కొలువుదీరడంతో జాతర వాతావరణం అప్పుడే సంతరించుకుంది.

Tags:    

Similar News