Heavy Rains: కామారెడ్డి జిల్లాలో అన్నదాతకు తీరని షోకాన్ని మిగిల్చిన అకాల వర్షం

* వర్షానికి తడిసి ముద్దయిన రోడ్లపై ఆరబోసిన ధాన్యం * తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

Update: 2021-11-16 04:31 GMT

వర్షానికి తడిసి ముద్దయిన రోడ్లపై ఆరబోసిన ధాన్యం(ఫైల్ ఫోటో) 

Heavy Rains: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.

వర్షం రాదేమో అనుకొని కొంతమంది రైతులు ధాన్యం సంచులలో నింపి టార్పాలిన్ కవర్లు కప్పడం మర్చిపోయారు. దీంతో రాత్రి అనుకోకుండా వర్షం కురవడంతో ధాన్యం కొట్టుకుపోయింది.

కొందరు రైతులు ట్రాక్టర్‌తో ధాన్యాన్ని కుప్పగా చేసే ప్రయత్నం చేశారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాత చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు. అయినా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు.

దాంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలుకావడంతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు అన్నదాతలకు తీరని షోకాన్ని మిగిల్చింది.

Tags:    

Similar News