Mancherial Student Suicide: ప్రాణాలు తీసిన డప్పా ఆన్‌లైన్ జూదం

Update: 2020-07-13 11:54 GMT

Online Game : సరదాగా ఆడే ఆన్‌లైన్ గేమ్ రాకాసిగా మారింది. డప్పా ఆన్‌లైన్ గేమ్ యువకుని జీవితంతో ఆటాడుకుంది. ఆన్‌లైన్ జూదం ఆడి లక్షల రూపాయాలు అప్పు చేశాడు. చివరకు యువకుడి ప్రాణాలు మింగింది. రాకాసి ఆన్‌లైన్ క్రీడకు బలైనా యువకుని పై హెచ్ఎంటీవీ స్పెషల్.

సరదాగా ఆడే ఆట ఒక యువకుడి ప్రాణాలు తీసింది. ఆట మోజులో పడి యువకుడు లక్షల రూపాయాల అప్పులు చేసి అవి తీర్చలేక ప్రాణాలను కోల్పోయాడు. మంచిర్యాల జిల్లా లక్షిట్ పేట్ మండలం మొదేల గ్రామానికి చెందిన తోట మధుకర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మధుకర్ కొన్ని రోజులుగా డప్పా ఆన్‌లైన్ గేమ్ కు బానిస అయ్యాడు ఆ ఆటను ఆడుతూ పదిహేను లక్షల అప్పు చేశాడు.

మధుకర్ చేసిన అప్పులను తల్లిదండ్రులు కష్టపడి తీర్చారు అయిన తన తీరు మార్చుకోకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దాంతో మనస్తాపంకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేశాడు. రాకాసి ఆన్‌లైన్ జూదం యువకుడు బలికావడంపై తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఆ గేమ్ కు బానిసకావడం వల్లే తన కొడుకు బలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకాసి లాగా మనుషుల ప్రాణాలు మింగుతున్న ఈ గేమ్ ను నిషేదించాలని సర్కార్ ను కోరుతున్నారు.

Tags:    

Similar News