కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఐదుగురికి కరోనా.. అందులో ఒకరు సింగరేణి కార్మికుడు..

కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఐదుగురికి కరోనా.. అందులో ఒకరు సింగరేణి కార్మికుడు..
x
Highlights

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటుంది. అయినా చాలా మంది ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించకుండా, పార్టీలనీ, ఫంక్షన్లనీ పెద్ద ఎత్తున్న ప్రజలు ఒక్క చోట గుమిగూడుతున్నారు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటుంది. అయినా చాలా మంది ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించకుండా, పార్టీలనీ, ఫంక్షన్లనీ పెద్ద ఎత్తున్న ప్రజలు ఒక్క చోట గుమిగూడుతున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలోనే నెల క్రితం హైదరాబాద్ నగరంలో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన బర్త్ డే పార్టీకి వెళ్లి ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. సరిగ్గా ఇదే తరహాలో మంచిర్యాల జిల్లాలోనూ ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా కేసులు నమోదవ్వడంతో బర్త్ డే పార్టీలు, ఫంక్షన్లు నిర్వహించడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో నమోదయిన కేసుల పూర్తివివరాల్లోకెళితే బెల్లంపల్లిలోని గంగాకాలనీలో సింగరేణి క్వార్టర్స్‌లో ఓ కానిస్టెబుల్ నివాసం ఉంటున్నాడు. కాగా అతని పెద్దకుమారుడి పుట్టిన రోజు వేడుకలను మే 31న నిర్వహించారు. ఈ వేడుకల్లో బంధువులు, తోటి కానిస్టేబుళ్లు, సింగరేణి ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పుట్టిన రోజుల వేడుకలు జరిగిన నాలుగు రోజులకు అంటే జూన్ 3వ తేదీన వేడుకలు నిర్వహించిన కానిస్టేబుల్‌ జ్వరం బారిన పడ్డాడు. అది సాధారణ జ్వరం అనుకున్న అతను దగ్గరలో ఉండే ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకెళ్లి చూపించుకున్నాడు. మందు వాడాడు. అయినా జ్వరం తగ్గకపోవడంతో రెండ్రోజుల తర్వాత మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌‌కు వెళ్లాడు. కాగా అక్కడి వైద్యుల అనుమానంతో అతన్ని బెల్లంపల్లిలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి టెస్టులు నిర్వహించారు. కాగా జూన్ 8న పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అప్రమ్తతమైన అధికారులు బర్త్ డే పార్టీకి హాజరైన 24 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా వారిలో రెండు రోజుల క్రితం ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ తరువాత ఆదివారం మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఒకరు సింగరేణి కార్మికుడు. కరోనా పాజిటివ్ వచ్చిన ఈ కార్మికుడు జూన్ 4వ తేదీ వరకు భూగర్భ గనిలో విధులు నిర్వహించినట్టు సమాచారం. భూగర్భ గనిలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సాధ్యం కాకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories