Telangana: కొనసాగుతోన్న జూనియర్ డాక్టర్ల నిరసనలు

Telangana: నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతోన్న జూడాలు * 15 శాతం స్టైఫండ్‌, 10 శాతం ఇన్సెంటివ్స్‌ చెల్లించాలని డిమాండ్

Update: 2021-05-24 05:28 GMT

జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల నిరసనలు రెండోరోజుకు చేరాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు జూనియర్ డాక్టర్లు. ఈ నిరసనలు రేపటివరకు కొనసాగనున్నాయి. 15 శాతం స్టైఫండ్‌, 10 శాతం ఇన్సెంటివ్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు జూనియర్‌ డాక్టర్లు. అలాగే.. కరోనా బారిన పడిన సిబ్బందికి నిమ్స్‌లో వైద్యం అందించాలని, కరోనాతో మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.

అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు డాక్టర్లు. లేదంటే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటిస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోన్న వేళ జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News