ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: మరో డెడ్ బాడీ వెలికితీత
SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో డెడ్ బాడీని మంగళవారం రెస్క్యూ టీమ్ వెలికితీసింది.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: మరో డెడ్ బాడీ వెలికితీత
SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో డెడ్ బాడీని మంగళవారం రెస్క్యూ టీమ్ వెలికితీసింది.డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎనిమిది మంది చిక్కుకున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిలో రెండు డెడ్ బాడీలను వెలికితీశారు. ఇంకా ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ డెడ్‌బాడీ ఎవరిది?
టన్నెల్ నుంచి వెలికి తీసిన డెడ్‌బాడీ ఎవరిదనే విషయాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో పరీక్షించిన తర్వాత డెడ్ బాడీ ఎవరిదనే విషయాన్ని తేల్చనున్నారు. టన్నెల్ లో చిక్కుకున్నవారి కుటుంబాలు మృతదేహల కోసం నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు.