Gellu Srinivas Yadav: గెల్లుపై వరాల జల్లు? ఎవరూ ఊహించని ఓ పదవి..

Gellu Srinivas Yadav: ఒకప్పటి ఉద్యమకారుడు ఇప్పుడు డీలాపడుతున్నారా?

Update: 2021-12-21 07:41 GMT

గెల్లుపై వరాల జల్లు? ఎవరూ ఊహించని ఓ పదవి..

Gellu Srinivas Yadav: ఒకప్పటి ఉద్యమకారుడు ఇప్పుడు డీలాపడుతున్నారా? హుజూరాబాద్‌లో బలిపశువును చేశారని ఫీలవుతున్నాడా? అక్కడ ఓటమి తర్వాత బోరుమని ఏడ్చిన ఆ నాయకుడిని అధిష్టానం ఎలా ఓదార్చబోతోంది? ఎవరూ ఊహించని ఓ పదవి ఇచ్చి పొలిటికల్‌ స్క్రీన్‌ మీద నిలబెట్టబోతోందా? ఆ ఏరియా లీడర్‌ను పవర్‌ సెంటర్‌గా మార్చబోతోందా? హుజూరాబాద్‌లో మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తున్న గులాబీ అధిష్టానం అక్కడి అభ్యర్థి విషయంలో తీసుకోబోయే ఆ కీలక నిర్ణయం ఏంటి?

గెల్లు శ్రీనివాస్‌. తెలంగాణ ఉద్యమకారుడు. అధిష్టానానికి బాగా కావల్సినవాడు. అందులో బీసీ. హుజూరాబాద్‌లో బరిలో ఈ కాలిక్యులేషన్సే వర్కవుట్‌ అయ్యాయి. గులాబీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డాడు. ధీటైన అభ్యర్థిగా ఈటలకు షాక్‌ల మీద షాకిలిచ్చాడు. కానీ చివరకు ఓడిపోయాడు. ఇదే గులాబీ హైకమాండ్‌ను దిగ్భ్రాంతికి గురిచేయగా ఊహకందని ఘోర పరాభవం అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోందట. దారుణ ఓటమి అధినేతను షాక్‌కు గురి చేస్తుంటే నష్ట నివారణ చర్యల కోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగారట. పరాజయంపై పోస్టుమార్టం చేస్తున్నారట. తేడా ఎక్కడ కొట్టి ఉంటుందని తన చాణక్య బుర్రకు పదును పెడుతున్నారట. హుజూరాబాద్‌ ప్రజలను ఎంతో నమ్ముకొని, ఎంతో వ్యూహంతో ముందుకెళ్లినా ఎవ‌రు హ్యాండ్ ఇచ్చి ఉంటారన్న దానిపై బీభత్సమైన కసరత్తే చేస్తున్నారట. ప్రజలకు, ఓటర్లు అనుకూలమైన వరాలే ప్రకటిస్తే ఓటేసే ముందు ఓటర్లు అసలేం ఆలోచించి ఉంటారన్న అంశాలపై ఆరా తీస్తున్నారట‌. హుజూరాబాద్‌లో ఈటలపై, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను బరిలో దింపితే ఎదురైన పరాజయంపై ఇంకా పోస్టుమార్టమ్‌ చేస్తున్నారట.

కష్ట సమయంలో చురుగ్గా ఆలోచించే కేసీఆర్‌ బుర్ర మరోలా ఆలోచిస్తుందట. అన్యాయంగా, అనవసరంగా గెల్లు శ్రీనివాస్‌ను బలి పశువును చేశారన్న అపవాదు నుంచి బయటకు వచ్చే ఉపాయం ఒకటి ఆలోచిస్తున్నారట. త‌మ రాజ‌కీయాల కోసం బీసీ నేత గెల్లును వాడుకున్నార‌నే విమర్శలకు సరైన విధంగా స్పందించాలన్న నిర్ణయానికి వచ్చారట. ప్రజలే కాదు ప్రతిపక్షాల్లో కూడా వినవస్తున్న ఈ ఆరోప‌ణ‌లకు చెక్‌ పెట్టే ఓ ఆలోచన చేయబోతున్నారట. ఆ ఆలోచనే గెల్లు శ్రీనివాస్‌కు కార్పొరేషన్‌కు పదవి కట్టబెట్టడం. అలా చేస్తే గెల్లును ఊరడించినట్టు ఉంటుందన్న కొన్ని ఒత్తిళ్లతో కేసీఆర్‌ కీలక ఈ నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనమండలికి పంపించి సముచిత గౌరవం ఆపాదించాలని అనుకున్నా ఈక్వేషన్స్‌లో అది సాధ్యం కాలేదు. అందుకే ఎలాగూ అసెంబ్లీలో బ‌లంగా ఉన్న టీఆర్ఎస్‌ బీసీ కోటాలో గెల్లును ఎంచుకోవాలని అప్పట్లో అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుందట. అది సాధ్యం కాకుంటే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వక‌పోతే, గ‌వ‌ర్నర్ కోటాలో పెద్దల సభకు పంపే అవకాశాలపైనా కసరత్తు చేసిందట. అదీ కూడా వర్కవుట్‌ కాకపోవడంతో సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్‌ భారీగా ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఏమైనా ఈటల గెలుపుతో మారిన రాజకీయ సమీకరణలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ బాస్‌ ఇప్పటి నుంచే తన బుర్రకు పదును పెడుతున్నారట. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఈట‌ల గెలుపు కోసం కృషి చేసిన కొందరు ఉద్యమకారులు గెల్లుకు ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట. ఈ మేరకు టీఆర్ఎస్‌ అధిష్టానంపై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి కూడా శ్రీ‌కారం చుట్టబోతున్నారట. మరి కేసీఆర్‌ ఆలోచన ఏంటి ఆయన మనసులో ఏముందో కాలమే తేల్చాలి.

Tags:    

Similar News