Niranjan Reddy: కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపం
Niranjan Reddy: మల్లు భట్టి విక్రమార్క చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది
Niranjan Reddy: కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపం
Niranjan Reddy: కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపంగా మారిందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. పాలమూరు రంగారెడ్డికి అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అని, 263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంను వదిలి 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల దగ్గర నుండి నీళ్లు తీసుకోవాలని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టినే అన్నారు. వందల కేసులను ఎదుర్కొని పాలమూరు రంగారెడ్డి పనులను తుదిదశకు తీసుకువచ్చామన్నారు.