నల్గొండలో విషాదం.. పెళ్లి చూపుల భయంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారని మనస్తాపానికి గురై యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2025-12-10 06:16 GMT

నల్గొండలో విషాదం.. పెళ్లి చూపుల భయంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారని మనస్తాపానికి గురై యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మర్రిగూడెం గ్రామానికి చెందిన శృతిగా గుర్తించారు. ప్రస్తుతం శృతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉన్నత చదువులు కొనసాగించాలని కోరుకున్న శృతికి పెళ్లి చేయాలని నిర్ణయించడం వల్లే యువతి సూసైడ్ చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.

హాస్టల్‌లో యువతి స్నానానికి వెళ్లి చాలా సేపు బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులకు అనుమానం వచ్చి డోర్ తెరిచి చూడగా శృతి విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News