KTR: దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే
KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు.
KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసి.. జిల్లాలో అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానన్నారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చి అందరిని మోసం చేసిందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తానని.. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. మార్పు మార్పు అంటూ రెండేళ్లలో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో అందరికి అర్థమయిందని కేటీఆర్ విమర్శించారు.