Mahesh Kumar Goud: కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
Mahesh Kumar Goud: తెలంగాణలో కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం కీలక ప్రకటన చేశారు.
Mahesh Kumar Goud: కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
Mahesh Kumar Goud: తెలంగాణలో కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులను భర్తీ చేస్తామని ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమ్మిట్‌పై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత హరీశ్ రావు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.
"సమ్మిట్ విజయవంతమైంది. అంతర్జాతీయ కంపెనీలు ఎన్నో ఒప్పందాలు (MOUలు) కుదుర్చుకున్నాయి. కంపెనీల ప్రొఫైల్ చూడకుండా ఎవరూ ఒప్పందాలు చేసుకోరు. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది," అని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో తమ రెండేళ్ల పాలనను పోల్చుకోవడానికి, చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ శ్రేణుల్లో ఎదురవుతున్న అసంతృప్తిని పరిష్కరించే దిశగా ఈ కార్పొరేషన్ పదవుల భర్తీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.