Revanth Reddy: స్టార్టప్‌లకు కేంద్రంగా హైదరాబాద్
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే కాకుండా యూనికార్న్ సంస్థలపై దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే కాకుండా యూనికార్న్ సంస్థలపై దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని టీ హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గూగుల్ ప్రస్థానం స్టార్టప్‌లకు ఆదర్శమని సీఎం అన్నారు. 25 ఏళ్లలో హైదరాబాద్‌లో స్టార్టప్‌లు పెద్ద కంపెనీలుగా మారాయని తెలిపారు. కష్టపడే తత్వం, సమిష్టి కృషితో విజయం సాధ్యమవుతుందని సూచించారు. స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని.. వెయ్యికోట్ల నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.