Vikarabad: స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. బస్సులో 40 మంది చిన్నారులు

Vikarabad: ఫిట్‌నెస్‌ లేని బస్సులను వాడుతున్నారంటూ మండిపాటు

Update: 2023-09-23 05:37 GMT

Vikarabad: స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. బస్సులో 40 మంది చిన్నారులు

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. సుల్తాన్‌పూర్‌ కుంటలోకి ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్పాగాయాలైనట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది స్టూడెంట్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాదంతో తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు విద్యార్థులు. హుటాహ‍ుటిన స్థానికులు.. వారిని కాపాడి బస్సులో నుంచి బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. స్టీరింగ్‌ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్కూల్‌ బస్సు డ్రైవర్‌ చెబుతున్నాడు. దీంతో.. పాఠశాల యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను వాడుతున్నారంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News