Nereducherla Municipal Election Results 2026: నేరేడుచర్లలో ‘హస్తం’ ఘనవిజయం: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. వెనుకంజలో బీఆర్‌ఎస్!
Nereducherla Municipal Election Results 2026: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది.
Nereducherla Municipal Election Results 2026: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో మెజారిటీ వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠంపై తమ జెండాను ఎగురవేసింది.
ఫలితాల సరళి ఇలా ఉంది:
మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పార్టీల బలాబలాలు:
కాంగ్రెస్: 09 వార్డులు
బీఆర్‌ఎస్: 05 వార్డులు
ఇతరులు (ఇండిపెండెంట్): 01 వార్డు
నేరేడుచర్లలో మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసిన కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పట్టును నిరూపించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 5 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు. కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు నేరేడుచర్ల పురవీధుల్లో భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు.