Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని వరించిన కాళోజీ సాహితీ పురస్కారం
Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది.
Kaloji Literary Award 2025: కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణ రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఈనెల 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈమె ఆంధ్రా బ్యాంకులో పనిచేసి సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగవిరమణ పొందారు.
చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకూ మధ్య, రమాయణం లాంటి అనేక కవితలు, కథలు, నానీలు రాశారు. రమ కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు. 2004లో సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు రమాదేవి పొందారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు.