Dikshant Parade 2021: జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోహ్‌

Dikshant Parade 2021: ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ * గౌరవ వందనం స్వీకరించిన కేంద్రమంత్రి

Update: 2021-08-06 05:33 GMT
హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో దీక్షాంత్‌ సమారోహ్ (ఫైల్ ఇమేజ్)

Dikshant Parade 2021: హైదరాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 72వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు దీక్షాంత్‌ సమారోహ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీక్షాంత్‌ సమారోహ్‌ సందర్భంగా శిక్షణ పొందిన 178 మంది పరేడ్‌ నిర్వహించగా కేంద్రమంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

శిక్షణ పొందిన వారిలో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది ఫారెన్‌ ఆఫీసర్స్‌ ట్రైనీలు ఉన్నారు. 144 మంది ఐపీఎస్‌లలో 23 మంది మహిళలు ఉండగా ఐపీఎస్‌లలో ఏపీ, తెలంగాణకు నలుగురు చొప్పున 8 మందిని కేటాయించారు.

Tags:    

Similar News