Nalgonda: నల్లగొండలో అధిక వడ్డీ వ్యవహారంపై పోలీసుల ఉక్కుపాదం

Nalgonda High-Interest Scam Police Arrest 2 Key Agents Seize ₹7 Crore Assets Main Accused Absconding

Update: 2025-10-15 06:56 GMT

Nalgonda: నల్లగొండ జిల్లాలో అధిక వడ్డీ వ్యవహారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కీలక ఏజెంట్లను అరెస్టు చేశారు.​ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఏఎస్పీ మౌనిక మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అధిక వడ్డీ వ్యాపారం పేరుతో అమాయక ప్రజలను మోసం చేశారంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.​ఈ కేసులో కొండమల్లేపల్లి మండలానికి చెందిన అభిషేక్, మహేష్ అనే ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు ASP మౌనిక తెలిపారు. వీరి నుంచి 7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

నిందితులు బాలాజీ నాయక్‌తో విభేదించి, పరారీలో ఉన్న మధు నాయక్ నేతృత్వంలో ఈ అధిక వడ్డీ వ్యాపారం చేసినట్లు నిర్ధారణ అయింది.​ మధు నాయక్, అభిషేక్, మహేష్‌లపై ఇప్పటివరకు 35 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు ఏజెంట్లను రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సూత్రధారి మధు నాయక్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేసినట్లు ఏఎస్పీ మౌనిక పేర్కొన్నారు. అధిక వడ్డీ ఆశ చూపి ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Full View


Tags:    

Similar News