నల్గొండ జిల్లా మర్రిగూడలో పత్తి రైతుల నిరసన
నల్గొండ జిల్లా మర్రిగూడలోని ఓ ఆగ్రో పత్తి మిల్లు ఎదుట పత్తి రైతులు నిరసన చేపట్టారు.
నల్గొండ జిల్లా మర్రిగూడలోని ఓ ఆగ్రో పత్తి మిల్లు ఎదుట పత్తి రైతులు నిరసన చేపట్టారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన పట్టించుకోకుండా మిల్లు యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికి సరైన ధర ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ ఇప్పటికే రైతుల పట్ల న్యాయం చేయాలని, మిల్లులు నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. కానీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులపై చర్యలు తీసుకొని పత్తికి సరైన ధర కల్పించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.