రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా మూసి ప్రాజెక్టుకు ఉధృతంగా వరద పోటెత్తుతుంది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా మూసి ప్రాజెక్టుకు ఉధృతంగా వరద పోటెత్తుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు కాగా.. ప్రస్తుతం 644 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 4.20 టీఎంసీలుగా కొనసాగుతుంది.
ప్రాజెక్టు ఇన్ ఫ్లో 49వేల 791 క్యూసెక్కులుగా ఉంది. దీనికి అనుకూలంగా ఔట్ ఫ్లో విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో మూసినది అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు, పశువులను మేపడానికి గాని ఎట్టి పరిస్థితిలో నదిలోకి దిగకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.