నిజామాబాద్ సారంగాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
Nizamabad: ఇబ్రహీంను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు
నిజామాబాద్ సారంగాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
Nizamabad: నిజామాబాద్ సారంగాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇబ్రహీంను కత్తులతో పొడిచి చంపారు ప్రత్యర్థులు. పుట్టినరోజు వేడుకల్లో ఓ పాట విషయంలో ఇబ్రహీం, ఆరిఫ్‌ల మధ్య వివాదం తలెత్తింది. మాట మాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఇబ్రహీంపై ఆరిఫ్, అతడి అనుచరులు కత్తులతో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇబ్రహీంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పరారాలో ఉన్న నిందితులు ఆరిఫ్, అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.