Munugode Bypoll: నామినేషన్ల మొదటిరోజే పట్టుబడిన డబ్బు..
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
Munugode Bypoll: నామినేషన్ల మొదటిరోజే పట్టుబడిన డబ్బు..
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈరోజు నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే నామినేషన్ల తొలి రోజే మునుగోడు నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. మునుగోడు మండలం గూడపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గూడపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద పోలీసులు డబ్బును గుర్తించారు. దానికి సంబంధించిన పత్రాలను అతడు చూపించకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్‌చేశారు.