మానకొండూరు పంచాయతీరాజ్ ఏఈపై ఎంపీపీ భర్త ఆగ్రహం.. కోపంతో వాటర్ బాటిల్ విసిరేసిన..

* మానకొండూరు పంచాయతీరాజ్ ఏఈపై ఎంపీపీ భర్త ఆగ్రహం

Update: 2023-01-26 10:50 GMT

కోపంతో వాటర్ బాటిల్ విసిరేసిన ఎంపీపీ భర్త శ్రీనివాస్‌రెడ్డి

Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎంపీడీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో మానకొండూర్ మండల ఎంపీపీ సులోచన భర్త శ్రీనివాస్ రెడ్డి పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిపై పనుల ప్రారంభోత్సవ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మీపూర్ పీహెచ్‌సీ పనుల ప్రారంభ విషయమై మాటా మాట పెరిగి పంచాయతీ రాజ్‌ ఏఈ చెప్పిన సమాధానంపై అసహనంతో వాటర్ బాటిల్‌తో ఎంపీపీ భర్త టేబుల్‌పై విసిరి వేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో అక్కడే ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సర్ది చెప్పారు.

Tags:    

Similar News